13-11-2025 06:59:38 PM
నిర్మల్ రూరల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న యువజన ఉత్సవాల సైన్స్ ఫెయిర్ ప్రదర్శనలో సోఫీ నగర్ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శన కలెక్టర్ ను ఆకట్టుకుంది. ఇటీవలే నాగర్ కర్నూల్ జిల్లా బస్సు ప్రమాదంలో మృతిచెందిన నేపథ్యంలో ప్రమాదాల నివారణకు టెక్నికల్ సాయంతో ప్రమాద హెచ్చరికలు జారీచేసే లైటింగ్ రవాణా సిస్టం ప్రదర్శన విద్యార్థులు వివరించగా దాన్ని ఆసక్తిగా రెండుసార్లు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో అటువంటి ప్రమాద దొరకుండా విద్యార్థులు ఇటువంటి ప్రయోగాలను చేయడం అభినందనీయమని విద్యార్థులకు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డేనియల్ ఉపాధ్యాయులు ఉన్నారు.