calender_icon.png 13 November, 2025 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీకి బీసీ రిజర్వేషన్ ఉద్యమ సెగ తగలాలి

13-11-2025 06:56:52 PM

బీసీ జేఏసీ చైర్మన్ రమేష్ రూపునర్..

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): బీసీలకు 42% రిజర్వేషన్లు సాధనే లక్ష్యంగా గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపుమేరకు బీసీల ధర్మపోరాట దీక్ష చేపట్టారు. బీసీ జేఏసీ చైర్మన్ రూపు నార్ రమేష్ మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు చేయకపోతే తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమం జరుగుతుందని, ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడిపెంచాలి.. వచ్చే పార్లమెంట్ సమావేశాలలో బీసి రిజర్వేషన్ల అంశంపై రాహుల్ గాంధీ ఇండియా కూటమి నేతలతో సమన్వయం చేసుకొని పార్లమెంటు స్తంభింపజేసి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేదాకా పార్లమెంట్ సమావేశాలు వేదికగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం బీసీలు తరపున రాజకీయ పోరాటం కొనసాగించాలని డిమాండ్ చేశారు.

బీసీల మాట పెడచెవిన పెట్టి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామంటే బీసీలు తాడోపేడో తెలుసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేసి, ఈడబ్ల్యూఎస్ జనాభా కంటే ఎక్కువగా 10 శాతం రిజర్వేషన్లు అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు పెట్టి కేంద్రానికి పంపితే రాష్ట్రపతి గవర్నర్ పెండింగ్ పెట్టారు. రెడ్డి జాగృతి నాయకులు హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించి తినే అన్నంలో మన్ను కలిపినట్టు చేశారని మండిపడ్డారు. రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు చేయకపోతే తెలంగాణ ఉద్యమ తరహాలో ఈ నెల 16న రన్ ఫర్ సోషల్ జస్టిస్, ఈనెల 18న ఎంపీలతో ములాఖత్, 23న డిసెంబర్ మొదటి వారంలో పార్లమెంటు ముట్టడి, డిసెంబర్ మూడో వారంలో బస్సు యాత్ర జనవరి 4న వేలవృత్తులు - కోట్ల గొంతులు అనే నినాదంతో హైదరాబాదులో భారీ బహిరంగ సభ రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. సిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యామ్ నాయక్, mrps జాతీయ ఉపాధ్యక్షులు రేగుంట కేశవ్  మద్దతు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ జేఏసీ కోఆర్డినేటర్ ప్రణయ్ కుమార్, బీసీ జేఏసీ వైస్ చైర్మన్లు గాజుల జక్కన్న, పొన్న రమేష్, మేరాజ్ భాయ్, వైరాగడి మారుతి పటేల్, నికోడె రవీందర్ అడ్వకేట్, జై భీమ్ సంఘ నాయకుడు ఝాడే అశోక్, గంగపుత్ర సంఘ నాయకుడు మోరేశ్వర్, నాయి బ్రాహ్మణ సేవా సంఘ నాయకుడు జూలూరి శంకర్,అఖిలభారత మాలిమహా సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నాగోశే శంకర్, బీసీ సంక్షేమ సంఘం ఆసిఫాబాద్ డివిజన్ అధ్యక్షుడు బొట్టుపల్లి ప్రశాంత్, ఆరే సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బొట్టుపల్లి జయరాం, బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గురునులే మెంగజీ గారు, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు లోబడే లహు కుమార్, ఆరే సంక్షేమ సంఘం నాయకుడు బొట్టుపల్లి శ్యామ్ రావు, బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు సిరికొండ సాయి కృష్ణ, సండే నామ్ దేవ్, నికోరే హనుమంతు తదితరులు పాల్గొన్నారు.