13-11-2025 07:09:16 PM
సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
ఎమ్మెల్యే జీఎస్సార్..
భూపాలపల్లి/రేగొండ/చిట్యాల (విజయక్రాంతి): కాంగ్రెస్ సర్కార్ అంటేనే పేదల సర్కార్ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.ఈ మేరకు ఎమ్మెల్యే గురువారం భూపాలపల్లి పట్టణం,రేగొండ, చిట్యాల మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 100 మంది లబ్దిదారులకు రూ.30,94,000 విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఆయా చోట్ల ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయ నిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు ఖరీదైన వైద్య చికిత్స చేసుకోలేక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న వారికి ఈ ఫండ్ ఆసరాగా నిలుస్తుందని, బాధితులు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వెంట ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.