13-11-2025 07:03:19 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): దహేగం మండలం గేర్రె గ్రామం గత నెల 18వ తేదీన జరిగిన కుల దురహంకార హత్యపై ప్రజాసంఘాలు దపలవారీగా పోరాట ఫలితంగానే ఈ రోజు జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, ఎస్పీ స్పందించి శ్రావణి కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. ఒక లక్ష రూపాయలు నగదు, నాలుగు లక్షల 12500 వేల రూపాయలు ప్రొసీడింగ్ కాపీలను శ్రావణి కుటుంబ సభ్యులకు అందజేశారు. మహిళా సంఘాల ద్వారా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడం కోసం ప్రయత్నం చేస్తాము మరణించిన శ్రావణి చిన్న తమ్ముడికి గురుకుల పాఠశాలలో చదువుకోవడానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారన్నారు.
ఈ నెల 22వ తేదీన శ్రావణి కుటుంబానికి మరిన్ని డిమాండ్ ల సాధన కోసం కుటుంబానికి 5 ఎకరాల భూమి, ఒకరికి ఉద్యోగం, 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఛలో కలెక్టరేట్ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజానీకం తరలివచ్చి శ్రావణికి కుటుంబానికి అండగా ఉండాలని కోరుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో KVPS జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, DYFI అధ్యక్ష కార్యదర్శులు గెడం,టికానంద్,గుడిసెల ,కార్తీక్.CITU జిల్లా అధ్యక్షులు రాజేందర్. DYFI జిల్లా ఉపాధ్యక్షులు.దుర్గం. నిఖిల్ ఉన్నారు.