calender_icon.png 9 May, 2025 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైనిక దళాలకు కాంగ్రెస్ మద్దతు

08-05-2025 01:19:26 AM

సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం

న్యూఢిల్లీ, మే 7: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) బుధవారం అత్యవసరంగా సమావేశం అయింది. ఈ సందర్భంగా సైనిక దళాల ఆపరేషన్ సిందూర్‌ను పార్టీ స్వాగతించింది. అంతే కాకుండా సైనిక దళాలకు పూర్తి మద్దతు ప్రకటించింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ సిందూర్ గురించి భేటీలో చర్చిం చాం.

మన సైనిక దళాలకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తుంది.’ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా సైనిక బలగా లకు కాంగ్రెస్ పూర్తి మద్దతిస్తున్నట్టు వెల్లడించారు. ‘టెర్రరిస్టులకు తగిన సమాధానం ఇచ్చిన ఆర్మీని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఆర్మీ దళాల తెగువకు సెల్యూట్.’ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, ప్రియాంక గాంధీ, సచిన్ పైలట్, పవన్ ఖేరా తదితరులు పాల్గొన్నారు.