calender_icon.png 9 May, 2025 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రవాదాన్ని ఉపేక్షించొద్దు

09-05-2025 09:13:48 AM

ఆపరేషన్ సిందూర్‌ విజయోత్సవ ర్యాలీ

మహబూబాబాద్, (విజయక్రాంతి): మానవ మనుగడకు ఉగ్రవాదంతో పెనుముప్పు పొంచి ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ పరిధిలోని వాకర్స్ అసోసియేషన్ కేసముద్రం (వి) ప్రతినిధులు పేర్కొన్నారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతంతో భారత సైన్యానికి మద్దతుగా సంఘీభావం తెలుపుతూ శుక్రవారం ఉదయం వాకర్స్ ఆధ్వర్యంలో కోరుకొండపల్లి  క్రాస్ రోడ్  నుంచి  కేసముద్రం (వి) బస్ స్టాండ్  వరకు ర్యాలీ  నిర్వహించారు.

అనంతరం పాక్‌ సరిహద్దులో జరిగిన కాల్పుల్లో అసువులు బాసిన భారత వీర జవాన్లకు నివాళులర్పించారు. దేశంలోని ప్రతీ పౌరుడు భారత సైనికులకు అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ కాంతాల వెంకట్ రెడ్డి , సోసుకండ్ల సంపత్ రెడ్డి, కంపాటి వీరయ్య, ఒంటెల సుధాకర్ రెడ్డి, పోలేపల్లి పుల్లారెడ్డి, అబ్బగాని యాకయ్య, ఉప్పునూతల రమేష్, రావుల శ్రీనాద్ రెడ్డి, గుండు శ్రీను, కముటం శ్రీనివాస్ , ఎన్నమాల ప్రభాకర్, గుండు గోపాల్, బైరు వెంకన్న , తుంపిళ్ళ వెంకన్న, వేముల రమేష్ రెడ్డి, పలుస రవీందర్ , కీర్తి సారయ్య, ఎలగలబోయిన చంద్రయ్య, గుండు ఉప్పలయ్య పాల్గొన్నారు .