calender_icon.png 9 May, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రవాదుల శవపేటికలపై పాక్ జాతీయ పతాకం

09-05-2025 03:52:36 AM

  1. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు
  2. ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ పాకిస్థాన్
  3. సామాన్య పౌరులు చనిపోయారన్నది అవాస్తవం
  4. ‘ఆపరేషన్ సిందూర్’లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా పెట్టుకున్నాం
  5. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ

న్యూఢిల్లీ, మే 8: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దాడుల్లో చనిపోయిన ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం చూస్తే పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనడానికి నిదర్శనమని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. ఉగ్రవాదుల శవపేటికలపై పాక్ జాతీయ పతాకాలు కప్పడం చూస్తే సామాన్య పౌరులు చనిపోయారన్నది అవాస్తవమని తెలిపారు.

‘ఆప రేషన్ సిందూర్’కు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు కల్నర్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లతో కలిసి గురువారం విక్రమ్ మిస్రీ విలేకరుల సమావేశం నిర్వహించారు.  విక్రమ్ మిస్రీ మాట్లా డుతూ.. ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, సైనిక స్థావరాలను కాదని స్పష్టం చేశారు. పహల్గాం దాడులకు తామే బాధ్యులమని రెసిస్టెంట్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) ఇప్పటికే రెండుసార్లు ప్రకటించుకుందన్నారు.

టీఆర్‌ఎఫ్ అనేది లష్కరే తోయిబా ముసుగు తొడుక్కున్న సంస్థ అని చాలాసార్లు చెప్పినట్టు పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితిలో పహల్గాం ఉగ్రదాడి చర్చల్లో టీఆర్‌ఎఫ్ పాత్రను పాక్ వ్యతిరేకించిందని తెలిపారు. అయితే దీనిపై తగిన ఆధారాలను ఇప్పటికే ఐక్యరాజ్యసమితికి అందించినట్టు తెలిపారు. ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ పాకిస్థాన్ అన్న విషయం చాలాసార్లు రుజువైందన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతో భార త్ తీవ్రంగా నష్టపోయిందని.. ముంబై, ఉరి, పుల్వామా, పఠాన్ కోట్ దాడులు మచ్చుకు కొన్ని ఉదాహరణలని స్పష్టం చేశారు. 

పాక్ చెబుతున్నవన్నీ అబద్ధాలే..

 ‘ఆపరేషన్ సిందూర్’లో సామాన్య పౌరులు చనిపోయారన్నది అవాస్తవమని, ప్రార్థనా స్థలాలపై  ఉగ్రవాద నిర్మూలనకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు పాకిస్థాన్ మతం రంగు పులుముతోందన్నారు. వాస్తవానికి పాకిస్థాన్ స్థానికంగా కొన్ని ప్రార్థనా స్థలాలను దుర్వినియోగం చేస్తూ ఉగ్రస్థావరాలుగా చేసుకుంటుందని ఆరోపించారు. సిక్కు లను లక్ష్యంగా చేసుకొని కశ్మీర్‌లో గురుద్వారాలపై దాడులు చేస్తోందని, ఇప్పటివరకు 16 మంది చనిపోయారని వెల్లడించారు.

సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిస్తోందని పాక్ దుష్ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. 60 ఏళ్లుగా ఆ ఒప్పందాన్ని గౌరవించామని, స్నేహంలో భాగంగానే అది అమలవుతోందని ఒప్పందంలో ఉందన్నారు. అయితే సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తున్నందుకే దాని అమలును నిలిపి వేశామన్నారు. ఇక నీలం ప్రాజెక్టును భారత్ లక్ష్యంగా చేసుకుందని పాక్ తప్పుడు ప్రచారం చేస్తోందని తెలిపారు. 

పాక్ దుశ్చర్యకు సమాధానమే ‘ఆపరేషన్ సిందూర్’

పాకిస్థాన్ దుశ్చర్యకు ‘ఆపరేషన్ సిం దూర్’ అనేది సమాధానం మాత్రమేనన్నారు. పహల్గాం దాడిపై బదు లిచ్చే హక్కు భారత్‌కు ఉందని ప్రపంచదేశాలు గుర్తిస్తున్నాయన్నారు. పహ ల్గాం ఘటనపై పాక్ సంయుక్త విచారణ కోరుతుందని.. అయితే ముంబై, పఠాన్ కోట్ ఘటనల్లో నేర విచారణకు పాక్ సహకరించలేదన్న విషయాన్ని గుర్తు చేశా రు. పాక్ ఎలాంటి చర్యలు తీసుకున్నా భారత్ ధీటుగా బదులిస్తుందని విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు.