calender_icon.png 9 May, 2025 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండియా గేట్‌, వార్‌ మెమోరియల్‌ వద్ద భద్రత కట్టుదిట్టం

09-05-2025 09:37:47 AM

న్యూఢిల్లీ: ఇండియా గేట్, వార్ మెమోరియల్(India Gate and War Memorial) వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రముఖ దేవాలయాలు వద్ద భద్రతా తనిఖీలు చేస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో అధికారులు ఎవరూ జిల్లా దాటి వెళ్లవద్దని స్పష్టం చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని సూచనలు చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో అనవసర ప్రయాణాలు చేయవద్దని ప్రజలను అధికారులు హెచ్చరించారు.  

దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతా చర్యలకు ఆదేశించారు. అన్ని విమానాశ్రయాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని విమానయానశాఖ సూచించింది. విమానాశ్రయ టెర్మినల్ భవనాల్లో సందర్శకులను అనుమతించవద్దని నిర్దేశించారు. దేశంలోని అన్ని విమానాశ్రయాలు, విమానయాన సంస్థలకు కూడా భద్రతా చర్యలకు ఆదేశించారు. అన్ని విమానాశ్రయాల్లోని సెకండరీ లాడర్ పాయియింట్ లో ప్రయాణికులను తనిఖీలు చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. విమానాశ్రయాల టెర్మినళ్లలో సందర్శకుల అనుమతిపై నిషేధం విధించారు. విమానాశ్రయాలకు ప్రయాణికులు 3 గంటల ముందే రావాలని సూచించారు. విమాన సర్వీసులు సాధారణంగా నడుస్తున్నట్లు ఢిల్లీ ఎయిర్ పోర్టు(Delhi Airport) వెల్లడించింది.