calender_icon.png 9 May, 2025 | 7:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా సహనాన్ని పరీక్షించొద్దు

09-05-2025 03:55:49 AM

  1. దేశ సమగ్రత, భద్రతే మాకు ముఖ్యం
  2. దాడులకు ప్రతిదాడులు తప్పవు
  3. పాక్‌కు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హెచ్చరిక

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): తమ సహనాన్ని పరీక్షించొద్దని భారతదేశ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌ను హెచ్చరించారు. తమకు తమ దేశ సమగ్రతే ముఖ్యమ ని, సవాల్ విసిరితే ఉపేక్షించేదేలేదని, అదేస్థాయిలో జవాబు చెబుతామని స్ట్రాంగ్ వార్నిం గ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని గురువారం ఆయన వెల్లడిం చారు. తమను రెచ్చగొడితే దీటైన సమాధానం ఇచ్చేందుకు దేశం పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన నొక్కి చెప్పారు.

ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిస్పందనగా ఇస్లామాబాద్, భారతదేశంలోని పదిహేను సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడికి ప్రయత్నించిందని తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా, భారత్, పాకిస్థాన్‌లోని అనేక ప్రదేశాల్లో వైమానిక రక్షణ రాడార్లను లక్ష్యంగా చేసుకొని ధ్వంసం చేసింద న్నారు. ‘మేము ఎల్లప్పుడూ బాధ్యతాయుతమైన దేశం గా చాలా సంయమనంతో వ్యవ హరిం చాం. చర్చల ద్వారా సమస్యలను పరిష్కారమవుతాయని మేం నమ్ముతాం.

కానీ దీన్ని ఆసరాగా చేసుకొని ఎవరైనా మా సహనాన్ని పరీక్షించొద్దు’ అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ‘ఎవరైనా మా సహనాన్ని అలుసుగా తీసుకొని మాపై దాడికి ప్రయత్నిస్తే, వారు ఆపరేషన్ సిందూర్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండా లి.’ అని పాకిస్థాన్‌కు ఘాటుగా బదులిచ్చారు. పాకిస్థాన్,  పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సాయు ధ దళాలు అమలు చేసిన ఆపరేషన్ సిందూర్‌ను రక్షణమంత్రి ఈమేరకు ప్ర స్తావించారు.

అక్కడి తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వం సం చేసినట్టు తెలిపారు. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారని ఆయన పేర్కొన్నారు. భారత సాయుధ దళా లు ప్రదర్శించిన ధైర్యం, సాహసాన్ని ఆయన అభినందించారు. పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలను వారు నాశనం చేసిన విధా నం మనందరికీ గర్వకారణమన్నారు. అయితే పాకిస్థాన్‌లోని అమాయకులకు ఎలాంటి హాని కలుగకుండా ప్రతిదాడులు చేసినట్టు తెలిపారు.

సవాల్ చేయడా లు, కుతంత్రాలు చేస్తూ కపటనాటకాలాడితే చావుదెబ్బ తీస్తామంటూ పాకి స్థాన్‌ను ఆయన హెచ్చరించారు. తమ సార్వభౌమత్వాన్ని ఎవరు సవాల్ చేయలేరని, ఒకవేళ అలా అనుకుంటే ఊరుకునేది లేదని, మరిన్ని సైనిక దాడులకు సిద్ధంగా ఉన్నామన్నారు. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రధాని మోదీ చాలా ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టారన్నారు.

రక్షణ రంగ ఉత్పత్తి, సాధికారతపై మోదీ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. రక్షణరంగంలో సార్వభౌమా ధికారం ఉండాలని ప్రధాని మోదీ చెప్పేది ఇందుకేనని రాజ్‌నాథ్ వెల్లడించారు. భారతదేశం తన సార్వభౌమత్వాన్ని కాపాడుకో వడానికి కట్టుబడి ఉందని ప్రజలకు హామీ ఇస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ‘మన దేశాన్ని రక్షించుకోకుండా ఏ పరిమితి మనల్ని ఆపదు. బాధ్యతా యుతమైన ప్రతిస్పందనకు మేం పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. రక్షణ ఆయుధ సంపత్తి మనకు పూర్తి బలాన్ని ఇస్తోంది’ రాజనాథ్ పేర్కొన్నారు