07-05-2025 12:29:43 AM
-ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి
ముషీరాబాద్, మే 6 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలకు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వల్ల న్యాయం, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు వల్ల మాదిగల అన్యాయం జరిగింది మాదిగ జేఏసీ చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు.
ఎస్సీ వర్గీకరణను హర్షిస్తూ మంగళవారం ఎమ్మార్పీఎస్ రాష్ర్ట కన్వీనర్ డాక్టర్ మీసాల మల్లేష్ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ బాబుజగ్ జీవన్‌రామ్ విగ్రహం వద్ద స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పిడమర్తి మాట్లాడుతూ తెలంగాణలో ముందు నుంచి ఏడు శాతం అడిగితే మాదిగలకు రేవంత్ రెడ్డి 9 శాతం రిజర్వేషన్ ఇచ్చి రోస్టర్‌లో 9.75 శాతం, అదేవిధంగా ఆంధ్రాలో ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు 6.5 శాతం మాల లకు 7.5 శాతం ఇచ్చినట్టుగా చూసామని అన్నారు.
అదేవిధంగా రోస్టర్ లో మాది గలకు 7 రావాల్సింది 6 శాతం, మాలలకు 8 శాతం వచ్చిందన్నారు. దానివల్ల మాదిగ లకన్యాయం జరిగిందన్నారు. కాబట్టి రోస్టర్ లో సరిచేయాలని చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. వర్గీకరణ ఉద్యమం చేసింది మాదిగలైతే లాభం ఆంధ్రలో మాలలకు జరి గిందన్నారు.
ముందు నుంచి మాదిగలు కూటమిలో భాగస్వామ్యం ఉన్నప్పటికీ విస్మ రించడం అన్యాయం అన్నారు. ౨౦26లో జరిగే జనాభా లెక్కల్లో ఆంధ్రాలో జిల్లాల వారిగా వర్గీకరణతో పాటు తెలంగాణ జిల్లా ల్లో కూడా వర్గీకరణ చేయాలని కోరారు. అదేవిధంగా మే నెలలో పెరేడ్‌గ్రౌండ్‌లో విజయోత్సవ సభ జరపాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బీఎస్‌ఎఫ్ రాష్ర్ట కన్వీనర్ బోరెల్లి సురేష్, బొమ్మరాజు స్టాలిన్, జేరిపోతుల సాయి, నక్క మహేష్, కోటి, గణేష్, శేఖర్ శివకుమార్ పాల్గొన్నారు.