04-05-2024 02:03:08 AM
బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి అరవింద్
నిజామాబాద్, మే 3 (విజయక్రాంతి ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీకి షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించే ఉద్దేశం లేదని, కేవలం ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునేందుకే ఆ పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఆరోపించారు. నిజామాబాద్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణతో కలిసి నిర్వహించిన ఎన్నికల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లను రద్దు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని, గతంలో జామీమా మిలియా, అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు రద్దుచేసి, వాటని ముస్లిం యూనివర్సిటీలుగా మార్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ, హెచ్‌సీయూనూ అలాగే మార్చే ప్రయత్నం చేస్తున్నదన్నారు.
దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీలు నష్టపోతున్నారన్నారు. రాష్ట్రంలోని మూడు షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఫ్యాక్టరీలు తెరిపించాలంటే రూ.800 కోట్లు అవసరమని, కానీ ప్రభుత్వం రూ.43 కోట్ల నిధుల కోసం బ్యాంకర్లతో ఎలా చర్చలు నిర్వహిస్తుందని ప్రశ్నించారు. ఇది రైతులను, కార్మి కులను మోసంచేసే ప్రయత్నమని అభిప్రాయపడ్డారు. బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 62 చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించిందని, మూతపడ్డ ఫ్యాక్టరీలు తెరిపి ంచే ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో ఉం దన్నారు. ఆ ఫ్యాక్టరీలు తెరిపించడం కేవ లం మోదీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉన్నంత వరకు రిజర్వేషన్లకు వచ్చిన ఢోకా ఏమీ లేదన్నారు. విదేశాల నుంచి వచ్చిన హిందు వులకు దేశంలో పౌరసత్వం వద్దని ఆం దోళన చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అభ్య ర్థి జీవన్‌రెడ్డిదన్నారు. దేశంలో ఎక్కడ బాంబు పేలుళ్లు జరిగిన, ఘటనకు మూలాలు జగిత్యాలలో ఉండేవన్నారు.