calender_icon.png 1 November, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇబ్రహీంపూర్ అడవిలో చిరుత సంచారం

04-05-2024 02:03:08 AM

మెదక్, మే 3 (విజయక్రాంతి): మెద క్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారిస్తున్నదని బీట్ ఆఫీసర్ నాగరా ణి తెలిపారు. అటవీ ప్రాంతంలో ఏర్పా టు చేసిన సీసీ కెమెరాల్లో చిరుత పులి ఆనవాలు శుక్రవారం కనిపించాయన్నారు. అడవిలోకి ఎవరు వెళ్లకూడదని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇబ్రహీంపూర్ ఫారెస్టు పరిధిలోని ఇబ్రహీంపూర్, బోనాల, గోవిందాపూర్, కిష్టాపూర్, పులిమామిడి, చిట్టోజిపల్లి, రుక్మాపూర్, రాంపూర్, కన్యారం గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండలన్నారు. అటవీ ప్రాంతంలో ఏదైనా జరిగితే అటవీశాఖకు సంబంధం ఉండదని ఆమె హెచ్చరించారు.