16-02-2026 03:14:05 PM
- బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్
- సీఎం ను కలిసి నిధుల అడుగుతా
- ప్రజల ఆశలు పెట్టుకున్నారు
- ప్రజలకి జవాబుదారిగా ఉండాలి
బెల్లంపల్లి,(విజయ క్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఎంతో ఆశతో కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించారని, బెల్లంపల్లి అభివృద్ధికి కోసం పనిచేయాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. క్యాంప్ ఆఫీస్ లో సోమవారం నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ దావా స్వాతి, వైస్ చైర్మన్ రాగం శెట్టి సత్యనారాయణ తో కలసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బెల్లంపల్లి ప్రజలు అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ కి పట్టగట్టారని పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితం తర్వాత బెల్లంపల్లికి పురపగ్గాలు చేతికొచ్చాయని అన్నారు.
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి కోసం పని చేయాలన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్,కౌన్సిలర్లు సరిగా పని చేయకపోతే ప్రజలు ప్రశ్నించే పరిస్థితి నెలకొంటుందన్నారు. బెల్లంపల్లి ప్రజలు చైతన్యవంతమైన వారిని ప్రశ్నించే పరిస్థితి తలెత్తకుండా అభివృద్ధి కోసం పాటుపడాలని హితవుపలికారు.
సీఎం రేవంత్ రెడ్డినీ నూతనంగా గెలిచిన కౌన్సిల్ తో వెళ్లి బెల్లంపల్లి మున్సిపల్ అభివృద్ధి కోసం నిధులు అడుగుతామన్నారు. ఇప్పటికే రూ. 20 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అభివృద్ధి ఎజెండా లక్ష్యంతో నూతనంగా గెలిచిన కౌన్సిలర్ పని చేయాలని ఉద్ఘాటించారు. అన్ని విధాలుగా కౌన్సిలర్ల కు అండగా ఉంటూ అభివృద్ధిలో బెల్లంపల్లి ని అగ్రస్థానంలో నిలబట్టేందుకు తమ సహకారం ఉంటుందన్నారు. బెల్లంపల్లి ప్రజలకు రుణపడి ఉంటామన్నారు.
- ఈ గెలుపు ప్రజలది..
నూతనంగా చైర్ పర్సన్ గా ఎన్నికైన దావ స్వాతి మాట్లాడుతూ, బెల్లంపల్లి ని సుందరవందనంగా తీర్చిదిద్దామని అన్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా బెల్లంపల్లి పురపాలక సంఘం పనిచేస్తుందన్నారు. ప్రజల అవసరాలను తీర్చడం ప్రధాన ఏజండగా పనిచేస్తామన్నారు. ఎంతో నమ్మకంతో తమను గెలిపించినందుకు ప్రజల రుణం అభివృద్ధి రూపంలో తీర్చుకుంటామన్నారు. అనంతరం వైస్ చైర్మన్ గా ఎన్నికైన రాగం శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ బెల్లంపల్లి అభివృద్ధి కోసం కలిసికట్టుగా ఒక జట్టుగా పనిచేస్తామని అన్నారు. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.