14-11-2025 01:00:49 PM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ(Jubilee Hills by election) నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 25 వేల ఓట్లకు పైగా మెజార్టీతో నవీన్ యాదవ్ తన సమీప బీఆర్ఎస్ ప్రత్యర్థి మాగంటి సునీతపై విజయం సాధించారు. ప్రతి రౌండ్ లోనూ కాంగ్రస్ అభ్యర్థి ఆధిక్యంలో దూసుకుపోయారు. 9వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 2,117 ఓట్ల మెజార్టీ వచ్చింది. 9 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 23,612 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ భారీ విజయాన్ని సాధించడం పట్ల ముగ్గురు మంత్రులు, ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వీ నవీన్ యాదవ్ కు భారీ మెజారిటీ వస్తున్న తీరు చూసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి, పశుసంవర్ధక శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇతర నాయకులు లడ్డూలు పంచుకుని ఒకరినొకరు అభినందించుకున్నారు.