14-11-2025 01:56:22 PM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నైతిక విజయం నాదే అని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత(Maganti Sunitha) పేర్కొన్నారు. నవీన్ యాదవ్ రౌడీయిజంతో విజయం సాధించారని మాగంటి సునీత ఆరోపించారు. 9వ రౌండ్ తర్వాత సునీత కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రౌడీయిజం నడిచిందన్నారు. కాంగ్రెస్ రిగ్గింగ్ చేసి గెలిచిందని సునీత తెలిపారు. ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారని ఆమె పేర్కొన్నారు. కార్యకర్తల కోసం మాట్లాడినా తప్పు అర్థం తీశారని చెప్పారు. దీనిని గెలుపు అంటారని అనుకోవడం లేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 24,658 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచారు. బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి డిపాజిట్ గల్లంతైంది. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ రెండు ఉప ఎన్నికల్లో గెలిచింది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.