16-12-2025 02:17:26 AM
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల బాహాబాహీ రంగంపేటలో ఉద్రిక్తత
కొల్చారం డిసెంబర్ 15 :(విజయ క్రాంతి ) మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం చివరి రోజైన సోమవారం కొల్చారం మండలం రంగంపేట గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. గ్రామపంచాయతీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ కా ర్యకర్తలు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పాటలతో బతుకమ్మ ఆడుతూ ఉండగా రంగంపేట లో ఎన్నికల ప్రచారం కోసం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కాన్వాయ్ వచ్చింది.
ఎమ్మెల్యే కాన్వాయ్ కి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుపడడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కారు నుండి దిగి నడుచుకుంటూ కార్యకర్తలు ఎన్నికల ప్ర చారం కోసం రంగంపేట కింది బజార్ వైపు వెళ్లారు. అయినప్పటికీ ఇరు పార్టీల కార్యకర్తల మ ధ్య తోపులాట జరిగింది. సమయానికి కొల్చారం ఎస్‌ఐ మహమ్మద్ మోహినుద్దీన్ స్పందించి వర్గాలను తన సిబ్బందితో కలిసి నెట్టివేసి శాంతింపజేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.