calender_icon.png 17 December, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టు

16-12-2025 06:10:25 PM

నంద్యాల: నంద్యాల జిల్లాలోని నందికొట్కూరులో డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టు అయింది. నంద్యాల పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎంబీయే చదువుతున్న విద్యార్థి మాదక ద్రవ్యాల టోలుయెన్ తయారీ కేంద్రం నడిపిస్తున్నాడు.  డ్రగ్స్ తయారీ కేంద్రంపై మంగళవారం దాడికి పాల్పడిన తెలంగాణ నార్కోటిక్ పోలీసులు అనుమతి లేకుండా అల్ర్పాజోలమ్ డ్రాగ్ తయారు చేసినట్లు గుర్తించారు.

భారీ స్థాయిలో మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మత్తు పదార్థాలను తయారు చేస్తున్న విద్యార్థి మధు, అతని తండ్రి సురేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ డ్రగ్స్ తయారీ, రవాణాలో అంతర్‌ రాష్ట్ర నెట్‌వర్క్ ఉందని, కీలక ఆధారాలను నార్కోటిక్స్​ బృందం  సేకరిస్తోంది. ఈ డ్రగ్స్ ముఠాలో స్థానికులతో పాటు బయటి వ్యక్తుల పాత్రపై ఉందని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ మేరకు నార్కోటిక్ బృందం కేసు నమోదు చేసి లోతుగా విచారణ జరుపుతోంది.