calender_icon.png 17 December, 2025 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమద్ నవాబ్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

16-12-2025 05:45:00 PM

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి..

కరీంనగర్ (విజయక్రాంతి): సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సమద్ నవాబ్ మరణం పార్టీకి తీరని లోటని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యాలయంలో సమద్ నవాబు సంతాప సభ నిర్వహించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు ఆరెపల్లి మోహన్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ.. పేద ప్రజల కోసం, వారి అభ్యున్నతి కోసం సమద్ నవాబ్ తపించేవారని, వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. వారి కుటుంబంలో ఒకరికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, నగరంలో ఏదో ఒక మార్గుకు సమద్ నవాబ్ మార్గుగా నామకరణం చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు ముడుపు మోహన్, కంరుద్దిన్, కొరివి అరుణ్ కుమార్, బానోతు శ్రావణ్ నాయక్, కామ్ రెడ్డి రామ్ రెడ్డి, పంజాల స్వామి గౌడ్, వెన్నం రజిత రెడ్డి, అహమ్మద్ అలీ, అబ్దుల్ రహమాన్, ముస్తాక్, అమీర్, బొమ్మ ఈశ్వర్ గౌడ్, మహమ్మద్, నిహాల్, లాయిక్, షబానా మహమ్మద్, ఇర్ఫాన్, బషీరుద్దీన్, మిరాజ్ డాన్,  అబ్దుల్ భారీ, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, సిరిపురం నాగ ప్రసాద్, వసీం, అక్బర్, ఆరిఫ్, గౌస్, పాషా, విక్టర్, సోహెల్, పాషా, జమీల్, సర్వర్, కలీం, సలీం, తదితరులు పాల్గొన్నారు.