16-12-2025 02:18:14 AM
వెల్గటూర్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): వెల్గటూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ‘రింగు‘గుర్తు గెలుపు దిశగా ప్రయాణిస్తోంది. గ్రామ ప్రజలకు గతం నుండే సర్పంచ్ అభ్యర్థి ‘బండమీది కవిత గోపి‘ ప్రతినిత్యం అందుబాటులో ఉండడoతో గ్రామస్థులు సర్పంచ్ అభ్యర్థికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అభ్యర్థి ఓటరును ఓటు అభ్యర్థించకుండానే ‘మా ఓటు మీకే వేస్తాం బిడ్డా‘ అంటూ అభ్యర్థికి ఎదురుగా వెళుతూ అక్కున చేర్చుకుంటు ప్రజలు ఆదరిస్తున్నారు.
సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ వెల్గటూర్ మండల కేంద్రాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చేదిద్ది ఇతర గ్రామాలకు రోల్ మోడల్ గా నిలపడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యం అన్నారు. వెల్గటూర్‌లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి విద్యుత్ కాంతులతో వెలిగిస్తామన్నారు. నూతన లైబ్రరీ భవనo ఏర్పాటు చేసి ఉద్యోగ లక్ష్య సాధనకు ఉపయోగపడే పుస్తకాలను నిరుద్యోగులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
వారసంత నిర్వహణలో సమస్యలు ఉన్నాయనీ, శాశ్వత పరిష్కారం చూపే ప్రణాలికలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ప్రతీ కులసంఘానికి కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ కేంద్రాలకు భవనాల ఏర్పాటు చేస్తామన్నారు. ‘రింగు గుర్తు‘ కు ఓటేసి అత్యధిక మెజారిటితో గెలిపించి ఆశీర్వధించాలని ఓటర్లను సర్పంచ్ అభ్యర్థి బండమీది కవిత గోపి విజ్ఞప్తి చేశారు.