16-12-2025 05:46:12 PM
హైదరాబాద్: సింగరేణి ఇన్ ఛార్జి సీఎండీగా ఐఏఎస్ అధికారి కృష్ణ భాస్కర్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఎండీ బలరాం డిప్యుటేషన్ పూర్తికావడంతో కేంద్ర సర్వీసుకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన స్థానంలో కృష్ణ భాస్కర్ కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర రెవెన్యూ సర్వీసు నుంచి డిప్యుటేషన్ పై తెలంగాణకు వచ్చిన బలరాం సింగరేణిలో సంచాలకుడిగా, ఇన్ ఛార్జీ సీఎండీగా మొత్తం ఆరేళ్ల పాటు పనిచేశారు. కేంద్రం నుంచి వచ్చిన అధికారులకు డిప్యుటేషన్ గడువు సాధారణంగా ఐదేళ్లపాటు ఉంటుంది. కానీ, అదనంగా మరో ఏడాది గడువు పొడిగించాలని తెలంగాణ సర్కార్ కేంద్ర ప్రభుత్వంతో విజ్ఞప్తి చేసింది.