calender_icon.png 17 December, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంబాడి జీవనశైలిని ప్రతిబింబించే ఉత్తమ ఫోటోగ్రఫీకి అవార్డు

16-12-2025 05:52:28 PM

ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా ఏళ్ళ భయ్యన్నకు జాతీయ అవార్డు..

చిట్యాల (విజయక్రాంతి): లంబాడి జీవనశైలి, గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను ఫోటోగ్రఫీ ద్వారా ప్రతిబింబించినందుకు చిట్యాల పట్టణానికి చెందిన ఏళ్ళ భయ్యన్నకు జాతీయ స్థాయిలో స్పెషల్ చిత్రం లంబాడా అవార్డు లభించింది. ప్రముఖ ఫాకల్టీ హుస్సేన్ ఖాన్(ఏఎఫ్ఐఏపీ) ఆధ్వర్యంలో జాతీయ స్థాయి లంబాడి లైఫ్‌స్టైల్ ఫోటోగ్రఫీ వర్క్‌షాప్, అవార్డు కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం, ఇల్లందు మండలం, రాళ్ళబండ గ్రామంలో 2025 డిసెంబర్ 13 నుండి 15 వరకు ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఫోటోగ్రాఫర్లు, కళాకారులు, సంస్కృతి ప్రేమికులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొని లంబాడి మహిళల జీవితం, వారి శ్రమ, ఆనందం, సంప్రదాయాలు, గ్రామీణ జీవన విధానాన్ని ఫోటోగ్రఫీ ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు.

ఈ సందర్భంగా లంబాడి జీవనశైలిని ప్రతిబింబించే ఉత్తమ ఫోటోగ్రఫీకి అవార్డులు ప్రదానం చేయగా, ఏళ్ళ భయ్యన్న చిత్రాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఈ స్పెషల్ చిత్రం లంబాడి అవార్డ్ ఫోటోగ్రఫీ అకాడమీ అఫ్ ఇండియా వ్యవస్థపకులు తమ్మ శ్రీనివాస్ రెడ్డి(ఎఫ్ఆర్పిఎస్) చేతుల మీదుగా ఏళ్ళ భయ్యన్న స్వీకరించారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు ఆయనను అభినందించారు. రాళ్ళబండ గ్రామంలో ఈ స్థాయి జాతీయ వర్క్‌షాప్ నిర్వహించడం గర్వకారణమని, గ్రామీణ సంస్కృతి పరిరక్షణకు ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. భయ్యన్నకు అవార్డు రావటం పట్ల ఫోటో గ్రాఫర్లు, స్నేహితులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫాకల్టీ షేక్ హుస్సేన్, వెంకట్, ఖమ్మం జిల్లా ఫోటోగ్రఫీ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.