calender_icon.png 17 December, 2025 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్‌లో జయ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

16-12-2025 05:48:06 PM

కరస్పాండెంట్ జయ వేణుగోపాల్

కోదాడ: సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ లో కోదాడ జయ ఒలంపియాడ్ స్కూల్ విద్యార్థులు సత్తాచాటారు అని పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ మంగళవారం తెలిపారు. ఐఐటి ఫౌండేషన్‌కు కొలమానంగా పరిగణించబడుతున్న డా. ఎఎస్ రావు అవార్డు కౌన్సిల్ నిర్వహించిన 35వ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్‌లో కోదాడకు చెందిన జయ ఒలంపియాడ్ స్కూల్ విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రదర్శన చూపుతూ మొత్తం 10 ర్యాంకులు సాధించారు. ఈ పరీక్షలో 9వ తరగతి నుంచి టి వర్షిణి, ఎ లిఖిత ప్రియ, ఎం తూర్పిక, ఎస్‌కె మిన్హాజ్, టి నేహా, ఎస్‌కె అష్రఫ్ అర్హత సాధించగా, 10వ తరగతి నుంచి ఎస్‌కె అబ్దుల్ ముసావ్విర్, ఎస్ సోమసాకేత్, జి లలితాదిత్య, పి వికాస్ ప్రతిభ కనబరిచి ర్యాంకులు సాధించారు.

ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను, వారిని ఈ స్థాయికి తీసుకొచ్చిన అధ్యాపక బృందాన్ని పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్‌తో పాటు డైరెక్టర్లు జె పద్మ, బి జ్యోతి, ప్రధానోపాధ్యాయులు చిలువేరు వేణు అభినందించారు. జయ ఒలంపియాడ్ స్కూల్‌లో అమలు చేస్తున్న అత్యుత్తమ శిక్షణా విధానాల ద్వారానే ఈ విజయాలు సాధ్యమయ్యాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో తమ పాఠశాల విద్యార్థులు ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో కూడా ప్రవేశాలు సాధించే స్థాయికి చేరుకునేలా విద్యా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. తమపై నమ్మకం ఉంచి అన్ని విధాల సహకరిస్తున్న తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.