16-12-2025 05:42:47 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ ఉప సర్పంచ్ లను మంగళవారం రాష్ట్ర మాజీ మంత్రి ఏ ఇంద్రకరణ్ రెడ్డి శాలువాతో సన్మానం చేశారు. నిర్మల్ దిలావర్పూర్ సారంగాపూర్ కుంటాల లోకేశ్వరం మామడ మండలాల్లో గెలుపొందిన సర్పంచులు ఉపసర్పంచులు మర్యాదపూర్వకంగా ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు మంత్రి సన్మానం చేశారు.