16-12-2025 06:14:13 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ- టెక్నో పాఠశాలలో మంగళవారం విజయ్ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి అమర జవాన్ల చిత్రపటానికి అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైనికుల వల్లనే నేడు మన భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. దేశ ప్రజలకు ఎల్లప్పుడూ రక్షణ కల్పించేది వారేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.