04-09-2025 12:00:30 AM
ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి
సిర్గాపూర్, సెప్టెంబర్ 3 : సిర్గాపూర్ మండల పరిధిలోని వాసర్ గ్రామంలో బుధవారం ఎ మ్మెల్యే పట్లోళ్ల సంజీవ్ రెడ్డి కొత్త రేషన్ కార్డులు, ఉచిత రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. పదేళ్ల కాలంలో చెప్పులు అరిగేలా, సామాన్య ప్రజలు రేషన్ కార్డుల కోసం తిరిగినా దొరకలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లను సకాలంలో నిర్మించుకోవాలని సూచించారు. ఆయనతో పాటు తహసీల్దార్ హేమంత్ కుమార్, కడ్పల్ యాదవ్ రెడ్డి, వాసర్ తాజా మాజీ సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.