04-09-2025 12:00:00 AM
మానకొండూర్ శాసన సభ్యులు కవ్వంపల్లి
మానకొండూర్, సెప్టెంబర్03(విజయక్రాంతి): గణేష్ నిమజ్జన ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పా ట్లు చేయాలని మానకొండూర్ శాసన సభ్యులు కవ్వపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ లో బుధవారం రోజు నగరపాలక సంస్థ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, ఇంజనీరింగ్ అధికారులు, మానకొండూర్ రెవెన్యూ, పంచాయితీ అధికార సిబ్బంది తో కలిసి శుక్రవారం రోజు జరగబోయే గణేష్ నిమజ్జనం ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా మానకొండూర్ పంచాయితీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు.
గణేష్ నిమజ్జనంకు చేయాల్సిన ఏర్పాట్లు, పాయింట్ వద్ద సమకూర్చాల్సిన సౌకర్యాలు, పోలీస్ బందోబస్తు తదితర అంశాల పై అధికారులతో సుదీర్ఘంగా చర్చించి రూట్ మ్యాప్ ను పరిశీలించారు. అనంతరం మానకొండూర్ చెరువు నిమజ్జనం పా యింట్ ను సందర్శించి చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసులు తగిన బందోబస్తు ఏర్పా టు చేసి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.