calender_icon.png 5 September, 2025 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో ప్రత్యేక పీడియాట్రిక్ డెంటల్

04-09-2025 12:00:00 AM

ప్రారంభించిన మెడికవర్ ఉమెన్, చైల్డ్ హాస్పిటల్స్

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): పిల్లల ప్రారంభ నోటి ఆరోగ్యాన్ని కాపాడి, భవిష్యత్తులో దంత సమస్యలను నివారించేందుకు మెడికవర్ ఉమెన్, చైల్డ్ హాస్పిటల్స్ ప్రత్యేక పీడియాట్రిక్ డెంటల్ సేవలను ప్రారంభించింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ విభాగం శిశువులు, చిన్నపిల్లల కోసం నిరోధక తనిఖీలు, పుచ్చిపోయిన పళ్లను శుభ్రం చేసి, ఆ పంటిని బాగుచేసే చికిత్స, అలాగే తల్లిదండ్రులకు నోటి పరిశుభ్రత మరియు ఆహార అలవాటులపై శిక్షణ వంటి సమగ్ర సేవలను అంది స్తుంది.

గర్భిణుల దంత ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ శరత్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా; డైరెక్టర్ సీటీవో, కాంప్లెక్స్ కరోనరీ ఇంటర్వెన్షన్స్ డైరెక్టర్ టీఏవీఆర్, స్ట్రక్చరల్ హార్ట్ డిసీజెస్, డైరెక్టర్ క్యాత్‌ల్యాబ్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రారంభ దశ లోనే నోటి సంరక్షణపై దృష్టి పెట్టడం ద్వారా పిల్లల చిరునవ్వులను మాత్రమే కాదు,

వారి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడగలుగుతామని చెప్పారు. డాక్టర్ రవీందర్‌రెడ్డి పరిగే మాట్లాడుతూ.. ‘నోటి ఆరోగ్యం ఒక చిన్నారి పోష ణ, మాటల అభివృద్ధి, ఆత్మవిశ్వాసానికి నేరుగా సంబంధించింది. అందుకే మేము ఈ సేవలను సాధారణ పీడియాట్రిక్ చికిత్స లో భాగం చేశాము” అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శరత్ (కన్సల్టెంట్ డెంటల్ సర్జన్) పాల్గొని, మాట్లాడారు.