26-07-2025 12:00:00 AM
మునిపల్లి, జూలై 25 : మండల పరిధిలోని బుదేరా చౌరస్తాలో గల మునిపల్లి పోలీస్ స్టేషన్ ను శుక్రవారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల మెయింటెనెన్స్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అన్నిరకాల విధులను తెలుసుకొని ఉండాలని, మారుతున్న సమాజానికి అనుగుణంగా, ఎలాంటి విధులనైనా చేయగలిగే విధంగా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆయా వర్టికల్ విభాగాలలో ఉత్తమ ప్రతిభ చూపి జిల్లాను ముందు వరుసలో నిలపడానికి కృషి చేయాలని అన్నారు.
పోలీస్ స్టేషన్ కు వచ్చే వారితో పోలీసు అధికారులు, సిబ్బంది మర్యాదగా మాట్లాడడంతో పాటు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు. హిస్టరీ షీటర్స్, సస్పెకట్స్ , పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, నైట్ బీట్, పెట్రోల్లింగ్ అధికారులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు.
అలాగే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రమాద అంచున ఉన్న చెరువులు, కుంటల వద్ద ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఎస్పీ వెంట స్టేషన్ ఇంచార్జి, ఏఎస్‌ఐ బక్కన్న, పోలీసు సిబ్బందిఉన్నారు.