గీతన్నల చైతన్య యాత్రను జయప్రదం చేయాలి: కల్లుగీత కార్మిక సంఘం
ఆలేరు,(విజయక్రాంతి): కల్లుగీత వృత్తి కార్మికుల సమస్యల పరిష్కారం, సంక్షేమం, ఆధునీకరణ కోసం మానుకోట నుంచి హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వరకు చేపట్టిన గీతన్నల చైతన్య యాత్ర ఈనెల 9న ఆలేరుకు రానున్న సందర్భంగా గురువారం ఆలేరులో కల్లుగీత కార్మిక సంఘం నాయకులు గోడపత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం గీతా కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రూ.4 వేల పెన్షన్, రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, పెండింగ్ రూ.20 కోట్ల ఎక్స్‌గ్రేషియా చెల్లింపులు, 50 ఏళ్లు నిండిన కార్మికులకు పెన్షన్, తాటి–ఈత చెట్ల రక్షణ, నీరా అభివృద్ధికి నిధులు, కాటమయ్య రక్షణ కవచం, సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు తదితర డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కోరుకొప్పుల కిష్టయ్య, రాష్ట్ర నాయకులు మొరిగాడు చంద్రశేఖర్, జిల్లా నాయకుడు మొరిగాడి రమేష్, మండల నాయకులు మిట్ట శంకరయ్య, ఘనగాని మల్లేశం, దూసరి మురళి తదితరులు పాల్గొన్నారు.






