ప్రో. జయశంకర్ సార్ కు బిజెపి నాయకుల నివాళులు
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ ఉద్యమ సిద్ధార్థ కర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనునిత్యం పరితపిస్తూ తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి మళ్లీ దశ ఉద్యమానికి సిద్ధార్థ కర్తగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆయన ఆశయ సాధనాలను ప్రతి ఒక్కరు ఆచరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి ఉమేష్ బిజెపి నాయకులు చీకటి రాజు పాశం భాస్కర్ రెడ్డి శివశంకర్ పురుషోత్తం సచిన్ నరేష్ అశ్విన్ భూమేష్ ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.






