30-04-2025 11:00:58 PM
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి ఏరియా స్థాయిలో నిర్వహించిన స్ట్రక్చరల్ సమావేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి ఏకాభిప్రాయం కుదిరింది. జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) తో నిర్వహించిన 5వ నెల ఏరియా స్థాయి స్ట్రక్చరల్ సమావేశం నిర్వచించారు. ఈ సందర్బంగా ఏరియా ఏరియా జిఎం జి దేవేందర్ మాట్లాడుతూ... గుర్తింపు సంఘ నాయకులు ప్రస్తావించిన పనులను పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు ఏ విధంగా ఉత్పత్తి లక్ష్యసాధన సహకరించారో, అదేవిధంగా ఇక ముందు సహకరించాలని యూనియన్ నాయకులను కోరారు.
అదేవిధంగా ఈ సమావేశంలో 4వ స్ట్రక్చరల్ సమావేశంలో జరిగిన పనుల పురోగతి గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు వెంకటస్వామి, ఏరియా ఎస్ఓటు జిఎం విజయ్ ప్రసాద్, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, డిజిఎం ఐఈడి రాజన్న, డిజిఎం ఈ అండ్ ఎం వెంకటరమణ, కేకే గ్రూప్ ఏజెంట్ రాంబాబు, సివిల్ ఎస్ఈ రాము, రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ ప్రసన్నకుమార్,డివైపిఎం మైత్రేయ బంధు, ఏరియా సెక్యూరిటీ అధికారి ఎన్ రవి, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.