30-04-2025 11:05:09 PM
అవకతవకలకు తావివ్వం...
టిపిసిసి సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్..
మండల పార్టీ నాయకులు చీమలమర్రి మురళి, జవాది రవి..
చర్ల (విజయక్రాంతి): మండలంలోని ఇందిరమ్మ ఇల్లు మంజూరు ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమక్షంలో జరుగుతుందని చర్ల మండలంలో సుమారు 6 నుంచి 7 వందల వరకు ఇల్లు మంజూరు చేయనున్నామని టిపిసిసి సభ్యులు నల్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు చీమలమర్రి మురళి, జవ్వాది రవిలు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సహకారంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నారని, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామాల్లో పర్యటించి నిజమైన పేదలను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేసి వారి పేర్లను ప్రభుత్వానికి సిఫారస్ తెలిపారు.
ఇందిరమ్మ ఇల్లులు మూడు విడతలగా మంజూరు చేయటం జరుగుతుందని, మొదటి విడతగా గడ్డి గుడిసెలో నివాసం ఉండే నిరుపేదలైన వారికి, వికలాంగులకు, వితంతువులకు ప్రాధాన్యత నివ్వనున్నట్టు తెలిపారు. రెండవ విడతగా స్థలం ఉండి అద్దెకు ఉండే పేదలకు ఇవ్వటం జరుగుతుంది, మూడవ విడతగా ఇంటి గోడలు నిర్మించుకొని రేకులు వేసుకొని ఉన్నవాళ్లకు ఇవ్వటం జరుగుతుంది తెలియజేశారు. మొదటి విడతగా ఇల్లు మంజూరు అయిన వారిని దళాలు గాని పార్టీ నాయకులకు గానీ డబ్బులు అడిగితే ఇవ్వవలసిన అవసరం లేదన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పెట్టిన ఇందిరమ్మ ఇల్లు కనుక ఎవరూ అధైర్య పడకుండా ఇల్లు వచ్చిన వారు త్వరగా ఇల్లు పూర్తి చేసుకొని ఇంటిలోనే ఉండాలని, ఎలాంటి ఆవకతవకలు జరిగిన వెంటనే లబ్ధిదారులు తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.