30-04-2025 10:57:22 PM
ప్రిన్సిపాల్ సువర్ణ...
నాగల్ గిద్ద (విజయక్రాంతి): పదవ తరగతి ఫలితాల్లో నాగలిగిద్ద మండలం మోర్గి మోడల్ స్కూల్ 94 మంది పరీక్షకు హజరు కాగా ఒక విద్యార్థి ఫెయిల్ కావడంతో 93 మంది ఉత్తీర్ణత ఫలితాలు సాధించి విజయధుంభి మోగించారని పాఠశాల ప్రిన్సిపల్ సువర్ణ అన్నారు. పాఠశాలలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... పాఠశాల విద్యార్థులు మిగిలిన పాఠశాలల విద్యార్థుల కంటే అద్భుత ఫలితాలు సాధిస్తూ ముందంజలో దూసుకుపోతున్నారన్నారు. పాఠశాల విద్యార్థిని కె. హేమబిందూ 572 మార్కులు సాధించి మండల మొదటి ర్యాంకు సాధించిందని ఆన్నారు.
వైశాలి 571, వైష్ణవి 568, స్నేహలత 567, అత్యధిక మార్కులు సాధించారని అన్నారు. 93 మందితో 99.55 శాతం ఉత్తీర్ణులై విజయం సాధించారని, క్రమశిక్షణతో కూడిన ఒత్తిడి లేని విద్యా, నిష్ణాత్తులైన ఉపాధ్యాయుల ద్వారా ప్రణాళిక బద్ధమైన బోధన, చిన్న తరగతుల నుండే నిరంతర సమగ్ర మూల్యాంకనం ద్వారా అధ్యాయనంతో ఇటువంటి అద్భుత విజయాలు సాధించగలమని వారు స్పష్టం చేశారు. అద్భుత విజయానికి తోడ్పడిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సువర్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా అత్యద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.