01-08-2025 12:58:23 AM
హైదరాబాద్, జూలై 31 (విజయ క్రాంతి): రాష్ర్టవ్యాప్తంగా నీటిపారుదల శాఖ భూముల పరిరక్షణకు పకడ్బందీ గా చర్యలు తీసుకుంటున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమా ర్ రెడ్డి పేర్కొన్నారు. వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములు కబ్జాకు గురైన పక్షంలో ఎంతమాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆక్రమణలకు గురైన భూములను యుద్ధ ప్రాతిపదికన స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆ భూముల చుట్టూ కంచె ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
గురువారం సచివాలయంలో హైడ్రా, ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్, ఈఎన్సీ అడ్మిన్ రమేశ్‌బాబు, వాలంతరి డైరెక్టర్ జనరల్ అనిత, హైడ్రా ఎస్పీ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
13,131 ఎకరాలు కబ్జా
మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ గండిపేట సమీపంలోని హిమాయత్ సాగర్, కిస్మ త్‌పురలతో పాటు రాజేంద్రనగర్ పరిధిలోని వాలంతరి, టీజీఈఆర్‌ఎల్‌కు చెందిన 42,6-30 ఎకరాలకు గాను 13,1-31 ఎకరాలు కబ్జాకు గురైనట్టు గుర్తించామని తెలిపా రు. అందులో ఐటీఐఆర్ ఆధీనంలో ఉన్న 81.26 ఎకరా ల అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. 50.13 ఎకరాలు ఆక్రమణకు గురైందని తెలిపారు.
ఈ ఆక్రమణలపై జిల్లా కోర్టులో 20 కేసులు పెండింగ్‌లో ఉండగా, హైకోర్టులో మరో 2 కేసులు నడుస్తున్నాయన్నారు. భూములను పరిరక్షిండంలో ఎటువంటి న్యాయపరమైన చిక్కులు ఏర్ప డ్డా ఎదుర్కొనేందుకు నీటిపారుదల శాఖ ప్రత్యేక సీనియ ర్ న్యాయవాదిని నియమించనున్నట్టు వెల్లడించారు.
కో ట్ల విలువ చేసే భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు గాను నీటిపారుదల శాఖ హైడ్రా, రెవెన్యూ, ఆర్ అండ్ ఆర్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. నీటి పారుదల క్వార్టర్స్‌లో ఆక్రమించుకున్న వారిని తొలగించడంతోపా టు తక్షణమే వాటి సమగ్ర సమాచారం అందించాలని ఆదేశించారు. భవిష్యత్‌లోనూ ఆక్రమణలకు చోటు లే కుండా పరిపాలనా పరంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, తద్వారా ఆక్రమణలకు చెక్ పెట్టొచ్చని సూచించారు.
సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు
రాష్ర్టవ్యాప్తంగా నీటి పారుదల కాలువల పక్కన ఉన్న భూముల్లో, ప్రాజెక్టులకు చెందిన భూములలో సౌర విద్యుత్ ప్లాంట్ ల ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నీటిపారుదల శాఖ భూములలో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై చర్చించామన్నారు. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులకు విద్యుత్‌ను అందించవచ్చని పేర్కొన్నారు.