22 August, 2026 | 5:05 AM

సీఎం అమెరికా పర్యటన రద్దు వెనుక కుట్ర

22-08-2026 01:27 AM
  1. కావాలనే కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోంది  
  2. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హనుమంతరావు

హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక బీజేపీ నేతల కుట్రలు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వి.హనుమంతరావు ఆరోపించారు. శుక్రవారం బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనే వికసిత్ భారత్‌లో తెలంగాణ రాష్ట్రం ఉండొద్దనే కుట్రలు ఉన్నాయని తమకు అర్ధం అవుతుందన్నారు.

రాష్ట్రం లో పెట్టుబడులు కోసం ప్రణాళిక ప్రకారం ముందు కు వెళుతున్న తెలంగాణకు కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని వీహెచ్ ఆరోపించారు. మెజారిటీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జనాభా దామాషాలో న్యాయం జరగాలన్న రాహుల్ గాంధీ లక్ష్యం కోసం కాంగ్రెస్ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. కేంద్రం చేపట్టే జనగణన గణాంకాల్లో ఓబీసీ జనాభా లెక్కలు చూపకుండా బీజేపీ మోకాలడ్డుతుందని వీహెచ్ విమర్శించారు. ఈ నెల 25న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఓబీసీ మహాసభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.