యోగాతో ఆరోగ్యం.. యోగాతో ఆనందం..
కామారెడ్డి జిల్లా యోగా అధ్యక్షుడు గడ్డం రాంరెడ్డి
తాడ్వాయి, ఆగష్టు 21 (విజయక్రాంతి): యోగాతో ఆరోగ్యం... యోగాతో ఆనందం పొందవచ్చని కామారెడ్డి జిల్లా యోగా అధ్యక్షులు గడ్డం రామిరెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్ గ్రామంలో శుక్రవారం యోగ ప్రథమ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ప్రతి ఒక్కరు ప్రతిరోజు యోగా చేయాలని ఆయన కోరారు. యోగా అనేది మనిషికి ఒక ఔషధంగా పనిచేస్తుందన్నారు.
రోజు యోగా చేసినట్లయితే మనం ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటామని తెలిపారు.కన్కల్ గ్రామంలో యోగ ప్రారంభమై ఏడాది పూర్తయినందున ఆనందంగా ఉందని తెలిపారు కన్కల్ గ్రామం మాదిగానే మిగతా గ్రామాలు సైతం ప్రతిరోజు యోగా చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మైలారం రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ చాకలి మహేష్, బిజెపి మండల అధ్యక్షులు వెల్మ సంతోష్ రెడ్డి, రెడ్డి సంఘం అధ్యక్షులు ధర్మారెడ్డి, పాల కేంద్రం అధ్యక్షులు కిష్టారెడ్డి, రవి,తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






