calender_icon.png 26 November, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతితో కానిస్టేబుల్ వికృత చేష్టలు

26-11-2025 12:40:18 AM

నిందితుడి అరెస్ట్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 25 (విజయక్రాంతి): యూనిఫాంలో ఉండి గౌరవాన్ని కాపాడాల్సిన ఓ ఏఆర్ కానిస్టేబుల్.. కామంతో కళ్లు మూసుకుపోయి నడిరోడ్డుపై ఓ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన పోలీసు శాఖ లో కలకలం రేపింది.అసలేం జరిగిందం టే..మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి పని ముగించుకుని నడుచుకుం టూ వెళ్తోంది.

అదే సమయంలో అటుగా బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి ఏఆర్ కానిస్టేబుల్ ఆమెను వెంబడించాడు. ఎవరూ లేని సమ యం చూసి.. బైక్‌పై వెళ్తూనే ఆమెను అసభ్యకరంగా తాకాడు. ఊహించని ఈ పరిణా మంతో సదరు యువతి తీవ్ర భయభ్రాంతులకు గురైంది.

నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తేరుకున్న బాధితురాలు వెంటనే మధురానగర్ పోలీసులను ఆశ్రయించింది. తన పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్ర వర్తించాడని ఫిర్యాదు చేసింది. కేసు నమో దు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.