23-12-2025 09:03:29 PM
నకిరేకల్,(విజయక్రాంతి): ఈ నెల 25 న క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న ప్రేమ విందు కార్యక్రమంపై నకిరేకల్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి అధికారులు, పాస్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ చైర్మన్ గుత్తా మంజులమాధవ్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు, నియోజకవర్గస్థాయి తహసిల్దార్లు, ఎంపీడీవోలు, స్థానిక కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.