calender_icon.png 23 December, 2025 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం కన్నెర్ర

23-12-2025 09:00:33 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముస్లిం మహిళ డాక్టర్ అని చూడకుండా హిజాబ్ ను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మహిళా లోకానికి జరిగిన అవమానంగా పరిగణిస్తూ నగరంలోని తెలంగాణ చౌక్ లో మంగళవారం జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముస్లిం మహిళలు, యువతులు నిరసన చేపట్టారు.

అనంతరం కరీంనగర్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో సీఎం నితీష్ కుమార్ పై లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామి హింద్ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి సయ్యదా సాజిదా బేగం, జిల్లా అధ్యక్షురాలు హాఫ్సా ఫాతిమా, గ్రామీణ అధ్యక్షురాలు అయేషా సుల్తానలు మాట్లాడుతూ సీఎం హోదాలో ఉన్నానని మరిచిపోయి నితీష్ కుమార్, చేసిన దౌర్భాగ్యపు పనికి ముస్లిం సమాజానికి, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

డిసెంబర్ 15న సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ఆయుష్ వైద్యులకు నియామక పత్రాలను అందజేస్తున్న సమయములో ఆయుష్ డాక్టర్ గా నియమకమైన నుస్రత్ పర్వీన్ బుర్ఖాలో హిజాబ్ ధరించి వచ్చిన డాక్టర్ ను,మహిళ అని చూడకుండా బలవంతముగా ఆమె ముఖముపై ఉన్న హిజాబ్ ను తొలగించి సీఎం హోదాలో నితీష్ కుమార్ చేసిన పని సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. సీఎం హోదాకు నితీష్ కుమార్ కళంకం తీసుకొచ్చారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.