23-12-2025 09:07:28 PM
నకిరేకల్,(విజయక్రాంతి): చేనేత వృత్తి కళతో పాటు భూదానోద్యమ మహాయజ్ఞానికి పునాదిగా నిలిచిన చారిత్రక స్థలంగా పోచంపల్లి పట్టణం దేశంలోనే ప్రసిద్ధిగాంచినదని, విద్యార్థులు, పరిశోధకులు చరిత్ర, రాజనీతిశాస్త్రం, ఆర్థశాస్త్రం, వాణిజ్య శాస్త్ర విభాగాల్లో ప్రత్యేక అధ్యయనాలు చేయడానికి అనువైన క్షేత్రమని నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.బెల్లి యాదయ్య అన్నారు. కళాశాల సామాజిక శాస్త్రాల విభాగం ఆధ్వర్యంలో భూదాన్ పోచంపల్లి క్షేత్ర సందర్శన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పోచంపల్లి పట్టణంలో చారిత్రకత, వృత్తి విలువలు, సాంకేతికత, ఆర్థిక పుష్ఠి తొణికిసలాడుతుందని, చేనేత, వ్యవసాయం, మార్కెటింగ్ రంగాల్లో సమకూరిన స్వావలంబనతో ప్రజాజీవితం అబ్బురపరుస్తుందని కొనియాడారు.