calender_icon.png 25 October, 2025 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లకు రాజ్యాంగ సవరణ జరగాలి

25-10-2025 12:41:28 AM

ఇందుకు అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలి

బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): జనాభా ప్రకారం విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లకు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడానికి రాజ్యాంగ సవరణ జరగాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు శుక్రవారం బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ అధ్యక్షతన బషీర్ బాగ్ ప్రెస్ క్ల బ్ లో జరిగిన బీసీ విద్యార్థుల రాష్ట్రస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ బంద్‌కు ఇచ్చినట్లుగానే రాజ్యాంగ సవరణకు కూడా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. రిజర్వేషన్ల సమస్యకు ప్రతిసారి వ్యతిరేక తీర్పులు వస్తున్నా యని, దీనికి రాజ్యాంగ బద్ధత కల్పించడమే శాశ్వత పరిష్కారమని అన్నారు.

అదే విధం గా స్థానిక సంస్థల రిజర్వేషన్లు విషయంలో మహారాష్ట్ర ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా బీసీలకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయని, కానీ ఆ రాష్ట్రాలలో బీసీలు తిరగబడలేదని అన్నారు. కానీ మన రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల రక్షణ కోసం రాష్ట్ర బంద్ జరపడం గర్వించదగిందని అన్నారు.

ఇది మన రాష్ట్రంలోని బీసీల చైతన్యానికి ప్రతీక అన్నారు. ఈ సమావేశంలో సంఘం జాతీయ కన్వినర్ గుజ్జ కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, జి. అనంతయ్య, సి. రాజేందర్, జక్కుల వంశీ కృష్ణ, వెంకటేశ్వర్లు, ప్రవీణ్ కుమార్, వేణుగోపాల్, మధుసూదన్, బాలయ్య, పృథ్వి, నరేష్, భాస్కర్, శివ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.