12-12-2024 01:04:19 AM
పోలీసులకు ఫిర్యాదు
నిజామాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో ఉన్న ఆర్‌కేఆర్ అపార్ట్‌మెంట్‌కు అడ్డంగా కొందరు నిర్మాణం చేపట్టే ప్రయ త్నం చేయడంతో అపార్ట్‌మెంట్‌వాసులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపార్ట్‌మెంట్ నుంచి బయటకు వెళ్లే గేటు వద్ద స్థలాన్ని కబ్జా చేసి, నిర్మాణం చేపట్టేందుకు కొందరు మంగళవారం రాత్రి టిప్పర్ లో ఇసుక, కంకరతో చేరుకున్నారు.
అపార్ట్‌మెంట్‌వాసులు గొడవకు దిగగా.. తాము బీఆర్‌ఎస్ నేత అనుచరులమంటూ వారిపై దుండగులు దాడులకు పాల్పడినట్టు ఆరోపించారు. అపార్ట్‌మెంట్‌వాసులు నిజామా బాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.