12-12-2024 01:02:48 AM
భయంతో పరుగులు తీసిన జనం
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 11 (విజయక్రాంతి): నాంపల్లిలో బుధవారం ఓ పెట్రోల్ ట్యాంకర్‌లో మంటలు చెలరేగడంతో స్థానికులు బయాందోళనకు గురయ్యారు. ఏక్‌మినార్ మసీద్ చౌరస్తాలోని హిందూస్థాన్ పెట్రోల్ బంక్‌లో.. ట్యాంకర్ నుంచి పెట్రోల్ అన్‌లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చేలరేగాయి.
గమనించిన వాహనదారులు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా బంక్ పక్కనే నాంపల్లి రైల్వే స్టేషన్ ఉండటంతో అంతా కంగారుపడ్డారు. ఈ అయితే మంటలు అదుపులోకి రావడం, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.