05-08-2025 08:46:26 PM
నాగారం: అన్నదానం మహా గొప్పదానo, ప్రతి ఒక్కరూ దైవచింతన ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి అని నాగారం మండలం నర్సింహుల గూడెం గ్రామానికి చెందిన ఏకేఎల్ లాజిస్టిక్స్ ప్రైవేట్ బస్సుల అదినేత బచ్చు ప్రభాకర్ - సరళ దంపతులు అని అన్నారు . మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామంలోని 2లక్షలపై వ్యయంతో ఆంజనేయ స్వామి దేవస్థానం నిర్మాణం పూర్తి చేసి రోజున 200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాట్లాడుతూ... అన్ని దానముల కెల్లా అన్నదానం గొప్పదని, ప్రతి ఒక్కరూ భక్తి భావనతో నడుచుకోవాలని,భక్తితో ఉంటే మంచి పనులు చేయాలనే ఆలోచనలు వస్తాయని పుట్టిన ఊరికి ఏదో ఒక రూపంలో గ్రామ అభివృద్ధికి నా వంతు సహాయం సహకారం చేస్తానని అందుకు గ్రామ ప్రజలు సహకరించాలని అన్నారు.