10-07-2025 12:54:55 AM
కొత్తపల్లి, జూలై 9 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామములో పద్మశాలి వాడ నుండి వయా కోనరావుపేట ఎస్సి కాలనీ నుండి వంద పిట్ల జగిత్యాల రోడ్డు వరకు సీసీ రో డ్డు నిర్మిస్తున్నారు.
ఈ సీసీ రోడ్డు నక్ష ప్రకా రం కాకుండా ఇష్టనుసరం రైతుల పంట పొలాల నుండి వేయడం జరుగుతుంది. నక్ష ప్రకారం ఉన్న రోడ్డును గ్రామం లోని కొం దరు కబ్జా చేసారని, ఈ విషయమై వెదిర గ్రామస్తుడు మేనేని రంగారావు, కాంగ్రెస్ నాయకులు వెన్న రాజమల్లయ్య లు కలెక్టర్ కు పిర్యాదు చేయడం జరిగింది. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులుకోరుతున్నారు.