10-07-2025 04:44:00 PM
నూతనకల్ (విజయక్రాంతి): మండల కేంద్రంలోని రోడ్లపై ఇరువైపులా తోపుడు బండ్లపై పండ్ల వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులు గురువారం తహసీల్దార్ శ్రీనివాసరావుకు పని ఉపాధి భద్రత కల్పించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య(IFTU District General Secretary Ganta Nagayya) మాట్లాడుతూ... ఎన్నో సంవత్సరాలుగా రోడ్ల వెంట పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులను గ్రామపంచాయతీ సిబ్బంది ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని బండ్లను తొలగించడం వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారిని వెంటనే ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు దాసరి శ్రీనివాస్, ఆదర్శ తోపుడుబండ్ల కార్మికుల యూనియన్ నాయకులు కనక వెంకటమ్మ, బిందు, భద్రమ్మ, శ్రీహరి, గణేష్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.