calender_icon.png 10 July, 2025 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ హాస్టళ్లలో వసతులేవి?

10-07-2025 12:53:51 AM

  నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి 

 సీనియర్ సివిల్ జడ్జ్ ఉదయభాస్కర్ 

నిజామాబాద్, జూలై 9 (విజయ క్రాంతి): నిజామాబాద్ నగరంలోని నాందేవ్ వాడ ప్రభుత్వ బాలుర ఎస్ సి, బిసి వసతి గృహలను నిజామాబాద్ జి ల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు బుధవారం తనిఖీ చేశారు.హాస్టల్స్ ను కలియతిరిగి వంట గది, వాష్ రూమ్స్, విద్యార్థులు నిదురపోయే స్థలాలను పరిశీలించారు. మెస్ మెను ప్రకారం భోజనం పెట్టటం లేదని తెలుసుకున్నారు. కరి, పప్పు వడ్డించాల్సింది ఉండగా ఒక దగ్గర పప్పు చారు, మరొక దగ్గర కరి ఒక్కటే విద్యార్థులకు భోజనంలో వడ్డిస్తూన్నది గమనించారు.

కరి,పప్పు చారు విడి విడిగా ఒకేసారి వడ్డించే విధానాన్ని అలవార్చుకోవాలని మెస్ సిబ్బందికి జడ్జి ఉదయ్ భాస్కర్ రావు సూచించారు. ఎస్. సి హాస్టల్ వసతులలేమితో ఉండటానికి గల కారణాల కనికట్టు ఏమిటి అని అడిగి తెలుసుకున్నారు. చదువుసంధ్యలను ఎట్లా ఉన్నాయని విద్యార్థులను అడిగి వాకబు చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్య, హాస్టల్ సదుపాయాలను వినియోగించుకుని చదువులో విజ్ఞానాన్ని పెoపొందించుకోవాలని విద్యార్థులకు ఉద్బోదిoచారు.

చదువు ప్రత్యేకమైన గుర్తింపును, సమాజంలో మంచి హోదాను, ఆర్థిక స్వాలంభనను, సాధికారతను కల్పిస్తుందని తెలిపారు.విద్య మూలం మిదమ్ జగత్ అంటూ జగతిని ఎలవచ్చని ఎరుక జేశారు. పాఠశాలలలో, హాస్టల్స్ లలో సమస్యలు ఉంటే న్యాయసేవ సంస్థకు తెలియ జేయాలని సంబంధిత అధికారులతో సంప్రదించి పరిష్కారానికి పాటు పడతామని జడ్జి విద్యార్థులకు తెలిపారు