calender_icon.png 11 July, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అశేష భక్తజనం మధ్య గురు పౌర్ణమి వేడుకలు..

10-07-2025 04:12:02 PM

108 కలశాలతో అభిషేకం

షిరిడీ సాయి దేవాలయంలో పోటెత్తిన భక్తులు..

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి):  గురు పౌర్ణమి వేడుకలు అశేష భక్త జనం మధ్య ఘనంగా జ జరిగాయి. పట్టణంలోని బూధబంగ్లా ప్రాంతంలోని శిరిడీ సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి పారవశ్యంలో జరుపుకున్నారు. గురుపౌర్ణమి సందర్భంగా భక్తులు అత్యంతపవిత్రoగా పూజలో మునిగిపోయారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వందలాది మంది భక్తులు షిరిడీ సాయి దేవాలయానికి తరలి వెళ్లారు. భక్తులతో దేవాలయం పోటెత్తింది. గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న  భక్తులు దేవాలయంలో పూజలు చేశారు. మహిళలు, పిల్లలు సాయి పూజలో నిమగ్నయ్యారు. షిరిడీ సాయిబాబాను వేలాది మంది భక్తులు వెళ్ళి దర్శనం చేసుకున్నారు.

వేద పండితులతో అర్చనలు, పూజలు చేపించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.గురుపౌర్ణమి పర్వదినాన్ని  పురస్కరించుకొని షిరిడిసాయి దేవాలయంలో 108 కళశాలలతో  పవిత్ర గంగాజలంతో జరిగిన అభిషేకo విశేషంగా చెప్పుకోవచ్చు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల కోసం నిర్వాహకులు అన్నదానం చేశారు. శిరిడి సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలకి తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాలయం ఉత్సవ నిర్వహణ కమిటీ తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించింది. గురు పౌర్ణమి వేళ భక్తులతో షిరిడీ దేవాలయం ప్రాంగణం కిటకిటలాడింది.