10-07-2025 04:41:25 PM
ఖమ్మం (విజయక్రాంతి): ఖమ్మం మెడికల్ కళాశాల(Medical College) ప్రిన్సిపాల్ గా టి శంకర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కళాశాలల ప్రిన్సిపల్ ల బదిలీల్లో భాగంగా ఖమ్మం మెడికల్ కళాశాలకు టి శంకర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల సిబ్బంది, జీజీహెచ్ సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏడి రఘు కుమార్, జీ జీ హెచ్ సూపరిండెండెంట్ రవి కిరణ్, ఆర్ ఎం ఓ రాంబాబు, ఏడి సంతోష్ కుమార్, బయో మెడికల్ ఇంజనీర్ ఇస్లావత్ రెడ్డి, నందగిరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.