రఘునాధగూడెంలో రూ.55 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం
కల్లూరు,జూన్ 22(విజయ క్రాంతి): గ్రామ ప్రజల సమస్యకు పరిష్కారం దిశగా రఘునాధగూడెం గ్రామపంచాయతీ పరిధిలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల నుంచి రూ.45 లక్షలు,సిఎస్‌ఆర్ నిధుల నుంచి రూ.10 లక్షలు కలిపి మొత్తం రూ.55 లక్షల వ్యయంతో ఈ పనులు ప్రారంభమయ్యాయి. రోడ్లు సౌకర్యం లేకపోవడంతో వర్షాకాలంలో బురదమయం కావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని గుర్తించిన సర్పంచ్ కుక్కా సుధారాణి రానా ముందడుగు వేశారు.
గ్రామ ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ను కలిసి నిధుల మంజూరు కోరగా, ఆమె తక్షణమే స్పందించి నిధులు విడుదల చేయడంతో రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యే రాగమయి దయానంద్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కర్ణాటి కోటేశ్వరి రామకృష్ణారెడ్డి,కుక్కా రానా, సాంబయ్య,బండి సూర్యనారాయణ,రావుల సీతయ్య,పోతురాజు రాము,బట్టు బాలకృష్ణ,జానపాటి వెంకటేశ్వర్లు,కుక్కా లాలు,శ్రీను, వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






